calender_icon.png 15 November, 2025 | 1:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు పడకల ఇండ్లలో వసతులు కల్పించాలి

15-11-2025 12:07:50 AM

కలెక్టర్ వెంకటేష్ ధోత్రే 

కాగజ్‌నగర్, నవంబర్ 14 (విజయక్రాం తి): నిరుపేదల కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన రెండు పడకల ఇండ్లలో మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లాలోని కాగజ్‌నగర్ మండలం బోరిగాం గ్రామ శివారులో నిర్మాణాలు పూర్తి అయిన రెండు పడక గదుల ఇండ్లను సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, రోడ్లు భవనాలు, గృహ నిర్మా ణ, విద్యుత్ శాఖల అధికారులు, మున్సిపల్ అధికారులతో కలిసి సందర్శించి సదుపాయాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన నిరుపేదల కొర కు ప్రభుత్వం నిర్మించిన రెండు పడక గదుల ఇండ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనులు చేపట్టాలని, పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ ఈ శేషరావు, గృహనిర్మాణశాఖ డిఈఈ వేణుగోపా ల్, రోడ్లు భవనాల శాఖ, మున్సిపల్ శాఖ అధికారులు, తహసీల్దార్ మధుకర్ పాల్గొన్నారు.