calender_icon.png 15 November, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం

15-11-2025 12:09:02 AM

ఎమ్మెల్సీ దండే విఠల్  

కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధికి ప్రభు త్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. శుక్రవారం పెంచికల్పేట్ మండల పరిధిలోని బొంబాయిగూడ, చేడ్వాయి గ్రామాలలో  సుమారు రూ. 20 లక్షల  నిధులతో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్సీ  శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పల్లెల రూపురేఖలు మారుతున్నాయి. గ్రామ పంచాయతీ భవనం అందుబాటులోకి వస్తే, గ్రామ కార్యకలాపాలు, సమావేశాలు నిర్వహించడానికి, ప్రజలకు సేవలు అందించడానికి కార్యదర్శి, సిబ్బందికి శాశ్వత వేదిక లభిస్తుందని తెలిపారు. గ్రామ స్వరాజ్య స్థాప న దిశగా ఇది మరో ముందడుగు అని పేర్కొన్నారు.

చేడ్వాయి గ్రామానికి చెందిన చింత పూడి సత్తయ్య  ఇద్దరు కుమార్తెలకు ఇచ్చిన మాట ప్రకారం చెరో 25వేల రూపాయలు బాండ్ ను  వారికి అందచేశారు.ఈ కార్యక్రమంలో  ఎంపిడిఓ ఆల్బర్ట్  , మాజీ జెడ్పీటీసీ సముద్రాల సరిత రాజన్న ,చేడ్వాయి మాజీ సర్పంచ్ సుజాత శ్రీనివాస్, కాంగ్రెస్ మండల నాయకులు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.