13-09-2025 09:23:13 AM
ఎస్ బీఐ రీజినల్ మేనేజర్ అనిల్ కుమార్
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): పొదుపు ఖాతాదారులు తమ ఖాతాలకు ఈ-కేవైసీ,నామినీ నమోదు తప్పక చేయించుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూర్యాపేట జిల్లా రీజనల్ మేనేజర్ బి అనిల్ కుమార్ సూచించారు.శుక్రవారం మండల పరిధిలోని కోడూరు గ్రామంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు, వ్యాపారులు తాము తీసుకున్న బ్యాంకు రుణాలను సకాలంలో చెల్లించాలని చెప్పారు. అలాగే పంట రుణాలను రెన్యువల్ చేసుకోవడం వల్ల కలిగే లాభాలను, పొదుపు భీమా పథకాలపై రైతులకు, ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో జాజిరెడ్డిగూడెం ఎస్ బీఐ మేనేజర్ బదావత్ రామకృష్ణ, ఎస్బీఐకి సంబంధించిన సీఎస్పీలు బిక్కి రమేష్ గౌడ్,డాక్టర్ తాడూరి రామకోటి,నూకల మల్లికార్జున్ రావు,ఉపేందర్,వెంకన్న,నర్సయ్యచారి,ఎస్ఎఫ్ఓలు విజయ్,రాజశేఖర్,రైతులు,స్వయం సహాయక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.