calender_icon.png 13 September, 2025 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ వినూత్న నిరసన

13-09-2025 03:41:34 AM

అదిలాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి):   ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాల యం పైకప్పు కూలిన నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి, వినూత్న నిరసన తెలిపారు. కాంగ్రెస్ హయంలో ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలు, పని చేసే ఉద్యోగులు ఎప్పుడు ఏ పైకప్పు కులుతోందనే భయంతో తలకు హెల్మెట్లు ధరించి రావాల్సివస్తుందం టూ.. తలకు హెల్మెట్లు ధరించి కూలిన ప్రాం తాన్ని  సందర్శించి వినూత్న నిరసన తెలిపారు.

బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సాజిదోద్దీన్ మాట్లాడుతూ.. గత ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో కొత్త కలెక్టర్ కార్యాలయ సముదాయం నిర్మాణానికి పనులు ప్రారంభమ య్యాయన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో నిధులు రాక కొత్త కలెక్టరేట్ పనుల పురోగతి నిలిచిపోయిందన్నారు. కొత్త కలెక్టర్ సముదాయం నిర్మాణం తక్షణమే పూర్తి చేయడానికి అవసరమైన నిధులు మంజూ రు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు యూనిస్ అక్బానీ, మెట్టు ప్రహ్లాద్, గండ్రత్ రమేష్, మార్శెట్టి గోవర్ధన్, చందాల రాజన్న, అడపా తిరుపతి, దయానంద్, ఫెరోజ్, జంగిల్ ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.