5 May, 2026 | 9:19 PM

సికింద్రాబాద్‌లో ATM నగదు దుర్వినియోగం కేసు – నిందితుడు అరెస్ట్

05-05-2026 08:23 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): సికింద్రాబాద్‌లో ATM నగదు దుర్వినియోగం కేసు వెలుగులోకి వచ్చింది. CMS ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ సికింద్రాబాద్ బ్రాంచ్ మేనేజర్ పి. నవీన్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఫిర్యాదు ప్రకారం, ATMలకు నగదు నింపే బాధ్యతలు నిర్వహిస్తున్న క్యాష్ కస్టోడియన్ వాసిరెడ్డి సీతారామ్ సుమారు ₹1.20 కోట్ల నగదును దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ATMల్లో నగదు జమ చేయకుండా, ఆ మొత్తాన్ని వ్యక్తిగత అవసరాలకు మళ్లించినట్లు తెలిపింది. ఈ ఘటనపై ఏప్రిల్ 11, 2026న కేసు నమోదు చేశారు. కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా నిందితుడు వాసిరెడ్డి సీతారామ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, న్యాయస్థాన ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.