5 May, 2026 | 9:40 PM

ఎఫ్‌సీఆర్‌ఐ ములుగులో యువతకు గుండె ఆరోగ్యంపై అవగాహన

05-05-2026 08:26 PM

ములుగు: సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల పరిశోధన కేంద్రంలో మంగళవారం యువ వయస్సులో గుండెపోటు నివారణ” అనే అంశంపై నిర్వహించిన ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ గుండె వైద్య నిపుణులు డా. మురళీధర్ బాబి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు  సూచనలు అందించారు.

ఈ సందర్భంగా ఆయన గుండె సంబంధిత వ్యాధులపై సమగ్రంగా వివరిస్తూ, ముఖ్యంగా కొలెస్ట్రాల్ ప్రభావం, భారతదేశంలో పెరుగుతున్న గుండెజబ్బుల మరణాల రేటు, యువతలో గుండెపోటు పెరుగుతున్న పరిస్థితులపై దృష్టి సారించారన్నారు. మధుమేహం, మానసిక ఒత్తిడి, శారీరక వ్యాయామం లోపం వంటి అంశాలు గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. ఎపిజెనెటిక్స్ పాత్రను కూడా సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు.

గుండెపోటు నివారణకు ఆరోగ్యకరమైన జీవనశైలి, నియమిత వ్యాయామం, సమతుల్య ఆహారం, ఒత్తిడి నియంత్రణ వంటి అలవాట్లు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే హార్ట్ అటాక్ కిట్ వినియోగంపై కూడా అవగాహన కల్పించారు. కళాశాల డీన్ శ్రీమతి ప్రవీణ మాట్లాడుతూ, విద్యార్థులు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపుతూ డా. బాబి సూచనలను తమ దైనందిన జీవితంలో అమలు చేయాలని సూచించారు. సమాజంలో కూడా ఈ అవగాహనను విస్తరించాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.