26 June, 2026 | 6:30 PM

Breaking News

బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ నియామకం   •   డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •   జగ్గారం పంచాయతీ పాలవాగు చెరువు ప్రక్షాళనకు ఎమ్మెల్యేకు వినతిపత్రం   •   Say No to Drugs: ఒక్కసారి డ్రగ్స్ బారిన పడితే... జీవితం నిర్వీర్యం   •   డ్రగ్స్ కేసులో దొరికితే.. ఎంతటి వారైనా వదిలిపెట్టం: భట్టి విక్రమార్క   •  

హత్య కేసులో మరో 12 మంది నిందితుల అరెస్టు

14-06-2025 12:57 AM

భద్రాచలంలో జరిగిన హత్య కేసులో మరో 12 మంది నిందితుల అరెస్టు

వివరాలు వెల్లడించిన ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ 

భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం ఏఎస్ఆర్ కాలనీలో జూన్ 7వ తేదీన కంచి సతీష్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన గుంజా సాయిరాంను అరెస్ట్ చేయగా  12 మంది నిందితులను శుక్రవారం పట్టుకొని అరెస్ట్ చేసినట్లు భద్రాచలం ఏ ఎస్ పి విక్రాంత్ కుమార్ సింగ్ తెలిపారు. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ హత్య చేసి పరారీ అయిన నిందితుల్లో 12 మందినీ అరెస్టు చేశామని, మిగిలిన ముద్దాయిల కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అరెస్టు చేసిన వారిని కోర్టులో హాజరు పరచడం జరుగుతుందని కూడా ఏఎస్పీ తెలిపారు. పట్టుబడిన వారిలో ఎం. మోహినుద్దీన్, మోటుపల్లి కామేష్, పల్లెపు సాంబ, పల్లెపు దుర్గాప్రసాద్, గుండి రాకేష్, గుంజ గోపీచంద్, గొల్ల గణేష్, చెంచాలపు రాహుల్ తేజ, బానోత్ మధు, చల్లా అజయ్, మోతుకూరు సాయి, గుంజా వెంకటేష్ ఉన్నట్లు తెలిపారు. ఈ సమాజంలో సీఐ నాగరాజు తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.