16 April, 2026 | 10:44 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతి చట్టం

14-06-2025 12:57 AM

మునిపల్లి, జూన్ 13 :  రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని తహసీల్దార్ గంగా భవాని అన్నారు. శుక్రవారం నాడు మండల పరిధిలోని పెద్ద గోపులారం  గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సు తాజా మాజీ ఎంపీటీసీ పాండు, గ్రామస్తులతో కలిసి  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూ సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ఈనెల 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతాయన్నారు. భూ రికార్డులో భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు సదస్సులో స్వీకరించి భూభారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి, నిర్దేశిత గడువులోపు సమస్యలను పరిష్కరిస్తారన్నారు. ఇందుకు దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన ఉంటుందన్నారు. అందుకు అధికారులకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎంపిటిసి పాండు, ఆర్‌ఐ సుభాష్, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.