calender_icon.png 6 September, 2025 | 7:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లైగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

03-09-2025 12:00:00 AM

గచ్చిబౌలి, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన అత్యాచార కేసులో నిందితుడు స్వాగత్ కుమార్ భోయ్కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 5 వేల జరిమానా విధిస్తూ ఎల్బీ నగర్లోని రంగారెడ్డి జిల్లా 13వ అదనపు సెష న్స్ జడ్జి కోర్టు తీర్పు వెలువరించింది. 2017 నవంబర్ 23న బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.

2009 నుంచి నిందితుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి మానసికంగా, శారీరకం గా వేధించాడని బాధితురా లు ఫిర్యాదులో పేర్కొంది. నోయిడా, చెన్నై, హైదరాబాద్లో కలిసి ఉంటూ లైంగిక దాడి చేశాడని తెలిపిం ది. నిందితుడు మరో మహిళతో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసి ప్రశ్నించగా తనతో పాటు కుటుంబ సభ్యులను బెదిరించాడని బాధితురాలు పిర్యాదు లో వివరించింది.

ఈ నేపథ్యంలో గచ్చిబౌలి పోలీసులు స్వగత్ కుమార్ భోయ్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణ పూర్తయ్యాక రంగారెడ్డి జిల్లా కోర్టు నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ, బాధితురాలికి 2 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది.