మైనర్ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్ష
నిర్మల్, (విజయక్రాంతి): నిర్మల్ రూరల్ మండలం చిట్యాల గ్రామంలో మైనర్ బాలుడుపై అత్యాచారం హత్య చేసిన నిందితుడికి నిర్మల్ ఫోక్సో కోర్టు యావజ్జీవ శిక్ష విధించినట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. గత ఏడాది జనవరి నెలలో గ్రామానికి చెందిన మైనర్ బాలుడిని అదే గ్రామానికి చెందిన తోకల రాజేశ్వర్ అలియాస్ రాజు అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై ఎస్సై లింబాద్రి ఫోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయగా రూరల్ సీఐ రామకృష్ణ, ఏఎస్పీ రాజేష్ మీనా దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా నిందితుడిని మంగళవారం కోర్టులో హాజరు పరిచారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుదర్శన్ రెడ్డి సాక్షులతో నేరం రుజువు చేశారు. దీంతో ఫోక్సో కోర్టు న్యాయమూర్తి శ్రీవాణి నిందితుడు రాజేశ్వర్ కు యావజీవ శిక్ష విధిస్తూ తీర్పురించారు.






