calender_icon.png 2 December, 2025 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఏసీపీ రవికుమార్..

02-12-2025 05:42:53 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ తనిఖీ చేశారు. మంగళవారం ఆయన తాండూరు మండలం కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలనీ కోరారు. సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలయిన తాండూర్, అచలాపూర్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంతవరకు ఎన్నికల నియమావళి ప్రకారం ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలని, ఎవరైనా అట్టి నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబమని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే వీడియోలను తీసి పెట్టరాదని, అలాంటివి మా దృష్టికి వస్తే గ్రూప్ అడ్మిన్ లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎన్నికల నిబంధనలు సూచ తప్పకుండా పాటించాలని పునరుద్ఘాటించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంతవరకు ఎన్నికల కోడ్ నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. ఈ కోడ్ ను ఉల్లంఘించకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా తమ సిబ్బందికి సహకరించాలన్నారు. స్వేచ్ఛాయుత పద్ధతిలో ప్రతి ఒక్కరు ఓటు వేయాలని పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. 100% పోలింగ్ కు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఆయన వెంట తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవయ్య, స్థానిక ఎస్సై కిరణ్ కుమార్ ఉన్నారు.