11 May, 2026 | 12:15 PM

Breaking News

కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •   రేపు హమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు, ర్యాలీ   •   పేద రోగులకు సేవ చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉన్నది   •   రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు   •   తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్, షెడ్యూల్ ఖరారు   •   అర్ధరాత్రి అమానుషం.. పోలీస్ కానిస్టేబుల్ హత్య   •  

యుద్ధం తీరుమారినా.. ముగిసేది రక్తపాతంతోనే!

27-02-2025 12:00 AM

యంగ్ హీరో ఆకాశ్ జగన్నాథ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘తల్వార్’. ఈ సినిమాను వార్నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై భాస్కర్ ఈఎల్‌వీ నిర్మిస్తున్నారు. యువ దర్శకుడు కాశీ పరశురామ్ తెరకెక్కిస్తున్నా రు. ఈయన ఇంతకు ముందు అశ్వత్థా మ, లక్ష్య సినిమాలకు రైటర్‌గా పనిచేశారు. ‘రణస్థలి’ అనే చిత్రానికి దర్శకత్వం వహిం చారు. తాజా చిత్రంలో పూరి జగన్నాథ్, ప్రకాశ్‌రాజ్, షిన్‌టామ్‌చాకో, అనసూయ భరద్వాజ్, అజయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

బుధవారం మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి ఆడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. వాయిస్ ఓవర్‌లో ఆకాశ్ తరతరాలుగా జరుగుతున్న యుద్ధం, రక్తపాతం గురించి గురించి చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ‘యుద్ధం జరిగే తీరు మారినా.. చివరకు రక్తపాతంతో ముగుస్తోంది.. అధర్మంతో అయినా ధర్మాన్ని గెలిపించేందుకు సిద్ధం’ అన్న ఈ డైలాగ్ గ్లింప్స్‌కు హైలైట్. ఇటీవల షూట్ స్టార్ట్ అయిన ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: త్రిలోక్ సిద్ధు; మ్యూజిక్: కేశవ కిరణ్; ఎడిటర్: ఐల శ్రీనివాసరావు.