25 July, 2026 | 1:29 AM

రుణాలు సక్రమంగా చెల్లించని వారిపై చర్యలు తప్పవు

25-07-2026 12:53 AM

అదనపు డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి 

నాగిరెడ్డిపేట, జూలై 24 (విజయక్రాంతి): మహిళా సంఘాల రుణాలు సక్రమంగా చెల్లించని వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఐకెపి అదనపు డిఆర్డిఓ విజయలక్ష్మి తెలిపారు. శుక్రవారం మండలంలోని లింగంపల్లి, గోపాల్పేట్, విజయసాయి గ్రామ సంఘాలలో నిర్వహించిన ప్రత్యేక రికవరీ డ్రైవ్లో పాల్గొన్నారు. మండలంలో ఎన్.పి.ఏ తగ్గించేందుకు మహిళా సంఘాలు, గ్రామ పెద్దలు సహకారాన్ని తీసుకోవాలని తీసుకోవాలని కోరారు. మహిళలకు రుణ రికవరీ చెల్లింపు పై అవగాహన కల్పించారు. 

గ్రామాలలో స్వయం సహాయక సంఘాలు మహిళలు తీసుకున్న రుణాల బాకీలు వెంటనే చెల్లించి ఆదర్శవంతమైన మండలం గా తీర్చి దిద్దేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆమె తెలిపారు. నాగిరెడ్డిపేట మండలంలో స్కూల్ పిల్లల యూనిఫామ్ కుట్టు కార్యక్రమాన్ని సందర్శించారు.ఈ కార్యక్రమంలో మండల సమైక్య అధ్యక్షురాలు శాంతమ్మ,యూనియన్ బ్యాంకు ఫీల్ ఆఫీసర్ గౌరవ్ షిండే,ఏపిఎం దత్తు,సీసీలు నజీర్,రవి,శ్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ రమణ,సంఘాల అధ్యక్షులు పద్మ,లక్ష్మి, వివోఏలు ఏసు, రమణ,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.