కూసుమంచిలో వీబీ-జీ రామ్ -జీ ఉద్యోగుల రెండో రోజు పెన్‌డౌన్
కూసుమంచి,(విజయక్రాంతి): వీబీ-జీ రామ్ -జీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు గతంలో ప్రభుత్వం ప్రకటించిన విధంగా తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని, నాన్ యఫ్ టి ఇ ఉద్యోగులను యఫ్ టి ఇ లుగా మార్చాలని, ప్రతి నెలా క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం రెండవ రోజు కూసుమంచి మండలం వీబీ-జీ రామ్ -జీ ఉద్యోగులందరూ పెన్‌డౌన్ నిర్వహించారు. అదేవిధంగా పనిచేసిన కూలీలకు సకాలంలో వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేసారు.
ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ, గత మూడు నెలలుగా వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఉద్యోగ భద్రతతో పాటు పే స్కేల్ అమలు చేయాలని కోరారు. ప్రతి నెలా నిర్దిష్ట తేదీన జీతాలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలు పరిష్కరించబడే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల ఐక్యతతో ప్రజాస్వామ్యబద్ధమైన ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎ పి ఓ అప్పారావు, టి ఎ లు శ్రీనివాస్, రవికాంత్, భవాని, నరేష్, హరినాయక్, కంప్యూటర్ ఆపరేటర్లు నరసింహారావు, తులసి ఫాల్గొన్నారు.






