23 June, 2026 | 11:24 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

తాసిల్దార్ ఆర్ఐపై చర్యలు తీసుకోవాలి

04-04-2026 04:23 PM

బోయినపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజుపల్లి పునరావాస పునర్ నిర్మాణ కాలనీలోని ఆలయాన్ని కాంగ్రెస్ నాయకుడు రవీందర్ కు రాసిచ్చిన తాసిల్దార్ నారాయణరెడ్డి, ఆర్ఐపై చర్యలు తీసుకోవాలని శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా జాయింట్ కలెక్టర్ కు ఆ గ్రామ సర్పంచ్ అనుమల భాస్కర్ ఫిర్యాదు చేశారు.

నీలోజ్ పల్లి గ్రామంలోని ఆలయాన్ని, ఆలయ భూమిని హక్కుదారుగా పేర్కొంటూ రవీందర్ కు వర్తించే విధంగా ఉత్తర్వులు జారీ చేసిన తహసీల్దారుపై చర్యలు తీసుకోవాలని ఆయన ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అదేవిధంగా గత నెల 30న దరఖాస్తు చేసిన వ్యక్తికి అది రోజు విచారణ జరిపి అదే రోజు సర్టిఫికెట్ ఏ విధంగా ఇస్తారని కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదులు ఆరోపించారు. తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చిన తహసిల్దార్, ఆర్ ఐ లను సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.