రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..
పోలీస్ స్టేషన్ నుండి తరలించిన ఇసుక వివాదానికి తెర
యాలాల తాసిల్దార్ గాయత్రి
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా యాలాల పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నిలువ ఉంచిన అక్రమ ఇసుక వేలం_ తరలింపు వివాదం నేటితో ముగిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే గత కొన్ని రోజుల క్రితం మండల పరిధిలో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని ఇసుకను పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నిల్వ ఉంచారు. అయితే అక్కడున్న ఇసుకను రెవెన్యూ అధికారులు బహిరంగ వేలం ద్వారా విక్రయించి వచ్చిన సొమ్మును ప్రభుత్వ ఖజానాకు జమ చేశారు.
బహిరంగ వేలంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో తాసిల్దార్ గాయత్రి ఇన్స్పెక్టర్ శివ చరణ్ కు మెమో జారీ చేసి విచారణ చేపట్టారు. వేలానికి సంబంధించిన దస్త్రాలు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అక్రమాలు ఏవి జరగలేదని నిబంధనల మేరకే వేలం జరిగినట్టు విచారణలో తేలిందని ఆమె తెలిపారు. దీంతో పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నిల్వ ఉంచిన ఇసుక వేలం వివాదం ముగియడంతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివ చరణ్ పనితీరుపై పలువురు ప్రజాప్రతినిధులు, స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.






