23 June, 2026 | 10:16 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం

23-06-2026 09:08 PM

చిట్యాల,(విజయక్రాంతి): అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబీవీపీ) రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్ పిలుపులో భాగంగా చిట్యాలలో నిర్వహించిన బంద్ విజయవంతమైందని ఎబీవీపీ చిట్యాల నగర కార్యదర్శి వంగూరి గణేష్ మంగళవారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రేషనలైజేషన్ పేరుతో వేలాది ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తూ ఎబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల విలీనాలు, మూసివేతల నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, ఖాళీగా ఉన్న ఎంఈఓ, డీఈఓ, టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు.

అలాగే గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనాలు నిర్మించాలని, జాతీయ విద్యా విధానం ( ఎన్ఈపి-2020)ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని విమర్శించారు. విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి, ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలని కోరారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపడతామని ఎబీవీపీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిద్ధు, యశ్వంత్‌తో పాటు ఎబీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.