28 August, 2026 | 3:40 AM

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

23-06-2026 09:05 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామ శివారులోని 445 జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా రామాయంపేట మండలం క్యాట్రాల గ్రామానికి చెందిన గడిల శ్యామయ్య భిక్కనూర్‌లో పని ముగించుకుని స్వగ్రామానికి వెళ్తుండగా జైకా హోటల్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో శ్యామయ్య కాలికి తీవ్ర గాయమై రోడ్డుపై పడిపోయాడు. సమాచారం అందుకున్న జీఎంఆర్ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక సహాయం అందించారు. అనంతరం అంబులెన్స్‌లో కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.