17 July, 2026 | 12:47 AM

పార్కులో నిర్మాణాలు చేపడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి

17-07-2026 12:00 AM

మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి 

ఎల్బీనగర్, జులై 16 : బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని మారుతీ నగర్  కాలనీలో  పార్కు స్థలాన్ని కొందరు కబ్జా చేశారు.  సర్వే నెంబర్ 179, 2017లో తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయగా, గతంలోనే కబ్జా చేసిన పార్కు స్థలంలో అక్రమంగా నిర్మాణం చేపడుతుండగా మారుతి నగర్ కాలనీ వాసులు అడ్డుకున్నారు. మళ్లీ  పార్కు స్థలంలో నిర్మాణ పనులు మొదలుపెట్టారు.

విషయం తెలుసుకున్న మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనపల్లి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పార్కు స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఎల్బీనగర్ మున్సిపల్ కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాలనీ పార్కు స్థలాన్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారని ప్రశ్నించారు.  రిజిస్ట్రేషన్, అనుమతులను రద్దు చేయాలని, పార్కును కబ్జా  చేసిన వ్యక్తులపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రావు, జిల్లా కౌన్సిల్ నెంబర్ శ్రీధర్ రావు,ప్రధాన కార్యదర్శి ప్రేమ్ నాథ్, విష్ణువర్ధన్ రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు మహేష్ గౌడ్, నాయకులు రవిశంకర్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ శర్మ, సంగమేశ్వర్ రావు,మహేందర్ రెడ్డి, ప్రభాకర్ యాదవ్, శ్రీనివాసరావు, నాగేష్,మురళి, నరసింహ, విజయ్ కుమార్, శబరి నాథ్, సునీల్ రెడ్డి, సందీప్, రాజు తదితరులు ఉన్నారు.