17 July, 2026 | 12:43 AM

అంగరంగ వైభవంగా జగన్నాథ రథోత్సవం

17-07-2026 12:43 AM

ముకరంపుర, జూలై 16 (విజయక్రాంతి): కరీంనగర్ నగర వీధుల గుండా శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం ఇస్కాన్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో గురువారం కన్నుల పండుగగా ప్రారంభమైంది. ఈ రథయాత్ర నగరంలోని మహాశక్తి దేవాలయంలో పూజా కార్యక్రమం జరిగింది ఇందులో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పొరేటర్లు బోయినపల్లి ప్రవీణ్ రావు, బండ రమణారెడ్డి లు పాల్గొన్నారు.

మధ్యాహ్నం 2 గంటలకు  ప్రారంభమైన రథయాత్ర నగరంలోని పలు వీధుల గుండా అశేష భక్తజన సమూహంతో, డప్పు చప్పుళ్లతో, భజన కీర్తనలతో హరే రామ హరే కృష్ణ అంటూ భక్తి పారవశ్యంతో నామస్మరణ చేస్తూ పులకించిపోయారు. గత ఐదు సంవత్సరాలుగా జరుగుతున్న ఈ రథయాత్ర మహోత్సవంలో కరీంనగర్ నగర ప్రజలు పాల్గొని భగవంతుని కృపా కటాక్షాలు పొందారు. ఈ రథయాత్రలో నిర్వాహకులు ఇస్కాన్ కరీంనగర్ అధ్యక్షులు నరహరి దాస్, కన్న కృష్ణ, డాక్టర్ ఎల్.రాజ బాస్కర్ రెడ్డి, తుమ్మల రమేష్ రెడ్డి, కొమరవెల్లి వెంకటేశం, బుర్ర మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు