calender_icon.png 11 January, 2026 | 2:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి

04-01-2026 12:08:38 AM

బంజారా భారత్ చైర్మన్, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్

ముషీరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): గత పదేండ్ల  బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అవినీతి,  అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించా లని బంజారా భారత్ సంస్థ వ్యవస్థాపక చైర్మన్, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా రవీంద్ర నాయక్ మాట్లాడుతూ కెసిఆర్ అవినీతి బాగోతాన్ని తన కూతురు కల్వకుంట్ల కవిత బయట పెట్టడాన్ని హర్షిస్తున్నామని, అట్టి ఆస్తులు తెలంగాణ ప్రజలకు దక్కేట్లు చేయాలన్నారు. దేశ వ్యాప్తంగా బంజారాల ఐక్యత, సమస్యల పరిష్కారం కోసం త్వరలో కేరళ, కర్ణాటక నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు వివిధ రాష్ట్రాల్లో ’బంజార భారత్ ప్రచార రథయాత్ర’ నిర్వహించనున్నట్లు  ప్రకటించారు.

యాత్రకు సంబంధిం చిన పోస్టర్ ను సంస్థ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సమావేశంలో బంజా రా భారత్ ప్రతినిధులు జగన్ నాయక్, హనుమంతు నాయక్, నాగమణి,  రవి నాయక్ రాథోడ్, భూక్య నాయక్,  రఘు రాం నాయక్, భీమా నాయక్  తదితరులు పాల్గొన్నారు.