calender_icon.png 11 January, 2026 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువకుడి అదృశ్యం

04-01-2026 12:07:57 AM

మేడిపల్లి, డిసెంబర్ 3 (విజయక్రాంతి) : ఇంటి నుండి వెళ్ళిన యువకుడు అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విహారిక కాలనీకి చెందిన కడారి యాదగిరి తన చిన్న కుమారుడైన  కడారి సురేష్ (32) డిసెంబర్ 11 సాయం త్రం 6 గంటల సమయంలో బయటకు వెళ్లి వస్తా అని చెప్పి ఇంటి నుండి బయలుదేరి తిరిగి ఇంటికి రాలేదు.

ఎక్కడ వెతికిన ఆచూకీ లభించకపోవడంతో  తన తండ్రి మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేశాడు.పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నామని, ఈ వ్యక్తి ఆచూకీ లభిస్తే మేడిపల్లి పోలీసులకు  సమాచారం ఇవ్వగలరని సీఐ గోవిందరెడ్డి తెలిపారు.