calender_icon.png 11 January, 2026 | 10:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

04-01-2026 12:09:56 AM

ఈటలకు వినతి

మేడ్చల్ అర్బన్ జనవరి 3 (విజయక్రాంతి):తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మల్కాజిగిరి బిజెపి పార్లమెంటు సభ్యులు మాజీ మంత్రి వర్యులు ఈటెల రాజేందర్ కు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ అండ్ సీనియర్ సిటిజన్స్ ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎంవి కృష్ణ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు.

అనంతరం ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎంపికి విన్నవిచ్చినట్లు ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సంక్షేమంతో పాటు అభివృద్ధిలో ఆర్టీసీ ఉద్యోగుల సేవలను గుర్తించి హయ్యర్ పెన్షన్ ల విష యంలో తమకు న్యాయం చేయాలని ఎంవి కృష్ణ ఎంపి ఈటెల రాజేందర్ ను కోరినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె నాగేశ్వర్ రావు.సభ్యులు రావి కృష్ణారెడ్డి విశ్రాంత ఆర్టిసి ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు