calender_icon.png 4 February, 2026 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంబీయూ యూనివర్సిటీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

04-02-2026 04:56:35 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): ఎంబీయూ యూనివర్సిటీ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోని యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ మండల నాయకులు ముదిగొండ ప్రశాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ములకలపల్లిలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు తెలియజేసి ఎంబీయూ యూనివర్సిటీ దోపిడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ... దోపిడి అక్రమాలపై ప్రశ్నించే ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులను గుండాలతో కిడ్నాప్ చేయడం సరైనది కాదన్నారు. యూనివర్సిటీ విద్యార్థుల నుండి అక్రమంగా వసూలు చేసిన 27 కోట్ల రూపాయలను వెంటనే విద్యార్థులకు చెల్లించాలని డిమాండ్ చేశారు.

యాజమాన్యం బహిరంగంగా విద్యార్థి సంఘాల నాయకులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిరంతరం విద్యార్థి సమస్యలపై ప్రశ్నించే విద్యార్థి నాయకుల జోలికి వస్తే ఎట్టి పరిస్థితులలో సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాగచైతన్య, రామ్ చరణ్, నందు, చందు, సింధు, ప్రియ, లావణ్య, మౌనిక, రాము, కార్తీక్, బిందు, మాధవి, కృష్ణ, వంశీ తదితరులు పాల్గొన్నారు.