calender_icon.png 4 February, 2026 | 8:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనగణన కాలంలో ఓబిసిలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలి

04-02-2026 04:52:49 PM

బీసీల పట్ల సవితి తల్లి ప్రేమ చూపిస్తున్న బిజెపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదు

బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాల ధనుంజయ నాయుడు

గరిడేపల్లి,(విజయక్రాంతి): జనగణన కాలములలో బీసీలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాల ధనంజయ నాయుడు అన్నారు. గరిడేపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఒక పత్రిక ప్రకటనలో... బీసీ సంఘాలు దశాబ్దాల కాలంగా చేస్తున్న పోరాట ఫలితమే నేడు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిందని జనగణనలో కులగణన చేసేందుకు ముందుకు వచ్చిందన్నారు.

ఒకపక్క బీసీ కులగణన చేపడుతున్నామని చెబుతున్న బిజెపి ప్రభుత్వం జన గణన కోసం తయారుచేసిన 33 ప్రశ్నలతో కూడిన పత్రావళిలో 12వ ప్రశ్నగా ఏర్పాటు చేసిన కాలంలో నీవు ఎస్సివా ఎస్టీవా లేదా ఇతరులలో ఉన్నారా అని అడిగారే గాని ఓబిసి వా అనే కాలం లేకుండా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో ఓబీసీలకు చెందిన ఎంపీలు పార్టీలకతీతంగా మౌనం వీడి తక్షణమే ఓబిసి కాలం బాక్సులు ఏర్పాటు చేయాలని అన్నారు. బిజెపి ప్రభుత్వం బిసి వ్యతిరేక విధానాలనే అవలంబిస్తుందని అన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు.బీసీలు ఐక్యమత్యంతో బిజెపి పార్టీకి బీసీ ఓటర్లు తగిన రీతిలో గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు