calender_icon.png 16 October, 2025 | 12:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమేళాల కాలుష్యంపై చర్యలు తీసుకోవాలి

15-10-2025 08:02:55 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని చెంగిచెర్ల మేకల మండి  కమేల నుండి ప్రతిరోజు దుర్వాసన రావడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని స్థానిక నాయకులు బుధవారం రోజున మాజీ కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్ ఆధ్వర్యంలో పర్యటించారు. మేకల మండి సందర్శించిన సందర్భంలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఎముకల ద్వారా నూనె ఉత్పత్తి, చర్మాల వ్యర్ధాలు నిలువ చేయడం వలన ఆ ప్రాంతంలో దుర్వాసన విపరీతంగా రావడం తో చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, ప్రజలు వ్యాధుల బారిన  పడి,  తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడి మూడు రోజులలో దుర్వాసన రాకుండా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కుర్రి శివ శంకర్, కొత్త ప్రభాకర్ గౌడ్, రంగ బ్రాహ్మన్న గౌడ్, కొత్త సుశాంత్ గౌడ్, గణేష్ నాయక్, ఉమేష్ చారి, బండారు సాయి, లింగస్వామి, కట్ట జగన్, సోమేష్, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.