calender_icon.png 13 June, 2025 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ అనుమతులు లేని పాఠశాలపైన చర్యలు తీసుకోవాలి

11-06-2025 08:25:55 PM

దేవరకొండ: దేవరకొండ పట్టణంలోని ఖమ్మం శ్రీ చైతన్య టెక్నో స్కూల్(Sri Chaitanya Techno School), నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలలను గుర్తించి వెంటనే వాటిపైన చర్యలు తీసుకొని మూసివేయాలని కోరుతూ బుధవారం నాడు హైదరాబాదులోని రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్(Regional Joint Director of School Education) కార్యాలయంలో తెలంగాణ గిరిజన పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కేతావత్ బాబు రామ్ నాయక్(Kethavath Baburam Naikఫిర్యాదు చేసారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్న విద్యాసంస్థలను మూసివేయాలని అదేవిధంగా దేవరకొండ పట్టణంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అడ్మిషన్లను కొనసాగిస్తున్న ఖమ్మం శ్రీ చైతన్య టెక్నో స్కూల్ పై తక్షణమే చర్యలు తీసుకొని మూసివేయాలని, దేవరకొండ మండల విద్యాశాఖ అధికారి నిర్లక్ష్యంపై విచారణ జరిపించి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు పత్రాన్ని అందించినట్లు వారు తెలిపారు.