17 April, 2026 | 10:34 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

కోడెదూడల మృతి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

01-06-2025 12:17 AM

వీహెచ్‌పీ ప్రచార ప్రసార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి 

హైదరాబాద్, మే 31(విజయక్రాంతి): రాష్ర్టంలో ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్న దేవాలయంలో కోడె దూడల మరణానికి కారణమవుతున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ రాష్ర్ట కమిటీ డిమాండ్ చేసింది.

సామర్థ్యానికి మించి ఇరుకైన స్థలంలో వందలాది కోడెదూడలను కుక్కడంతో, తొక్కిసలాటకు గురై కోడెదూడలు చనిపోతున్న విషయం బాధాకరమని, ఆలనా పాలన కరువైన కారణంగా మృత్యుఘోష కొనసాగుతోందని వీహెచ్‌పీ ప్రచార ప్రసార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు.

రెగ్యులర్ డాక్టర్ లేకపోవడం, పార్ట్‌టైమ్ అసిస్టెంట్లు సరిగా పట్టించుకోకపోవడం కారణంగా.. నిరంతరం కోడెదూడలు చనిపోవడం హేయనీయమని పేర్కొ న్నారు. రాజన్న ఆలయానికి కోట్లాది రూపాయల ఆదాయం ఉన్నప్పటికీ, గోశాల నిర్వహణ అత్యంత పేలవంగా ఉం డటం రాష్ర్ట ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.

శుక్ర వారం ఒక్కరోజే దాదాపు 12 కోడెదూడలు చనిపోవడం చాలా విషాదకరమని.. ప్రతిరోజు కోడెదూడలు చనిపోతుం టే, గుట్టుచప్పుడు కాకుండా వాటిని పూడ్చివేసి చేతులు దులుపుకోవడం దుర్మార్గమని తెలిపారు.