4 June, 2026 | 4:32 PM

అక్రమంగా ఇసుక, మట్టి రవాణా చేస్తే చర్యలు

04-06-2026 03:28 PM

జిల్లా కలెక్టర్ కె. హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): సరైన అనుమతులు లేకుండా ఇసుక, మట్టి తరలింపు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె. హరిత హెచ్చరించారు. గురువారం కాగజ్‌నగర్ మండలంలోని గన్నారం మాండవ, ఆరెగూడ, అనుకొడ గ్రామాల పరిధిలోని చెరువులను ఆమె సందర్శించి పరిశీలించారు. నజ్రుల్ నగర్ విలేజ్ నెం.12 గ్రామ పరిధిలో మట్టిని తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను తనిఖీ చేశారు.

తనిఖీలో సంబంధిత వ్యక్తుల వద్ద ఎలాంటి అనుమతులు లేదా అవసరమైన పత్రాలు లేవని గుర్తించారు. దీంతో ఆ ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అక్రమంగా మట్టి లేదా ఇసుక తరలింపుకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మట్టి, ఇసుక రవాణా చేపట్టే ముందు సంబంధిత శాఖల నుండి తప్పనిసరిగా అనుమతులు పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాగజ్‌నగర్ మండల తహసీల్దార్ మధుకర్, రెవెన్యూ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.