పార్టీ అనుబంధ విభాగాల కార్యకర్తలు పాల్గొనాలి
నేడు డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ ప్రమాణ స్వేకారం
మహబూబ్ నగర్ టౌన్, డిసెంబర్ 4: నూతన డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ పదవీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎస్పీసెల్ చైర్మన్ సాయిబాబా, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వసంత, జిల్లా యువజన అధ్యక్షులు అవేజ్ అహ్మద్. మైనార్టీసెల్ అధ్యక్షులు ఎండి. ఫయాజ్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు రాములుయాదవ్ కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
సంజీవ్ ముదిరాజ్ ఇంటి నుంచి భారీస్థాయిలో ర్యాలీ పార్టీ కార్యాలయం వరకు ఉంటుందని, అనంతరం కార్యాలయంలో ఆయన బాధ్యతలు తీసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనుబంధ విభాగాల శ్రేణులు పాల్గొనాలని వారు కోరారు. సమావేశంలో పార్టీ ఎస్టీసెల్ నాయకుడు కిషన్ నాయక్, నాయకులు ఆక్చర్ వెంకటేశ్, అలీమ్ పాల్గొన్నారు.






