24 June, 2026 | 5:46 PM

విద్యార్థులకు కీలక సూచనలు

24-06-2026 05:10 PM

నాగిరెడ్డిపేట్,జూన్ 24 (విజయక్రాంతి): మండలంలోని చినుర్  పాఠశాలను బుధవారం  ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్  సందర్శించారు.ఉదయపు ప్రార్థన సభలో పాల్గొన్నవారు. విద్యార్థులను ఉద్దేశించి ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ...విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై,బాగా చదువుకోని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.అనంతరం విద్యార్థులతో ముచ్చటించి,మధ్యాహ్న భోజనం రుచికరంగా,సంతృప్తికరంగా ఉందో లేదో తెలుసుకున్నారు.అలాగే విద్యార్థుల హాజరు,విద్యా ప్రగతి,మధ్యాహ్న భోజన పథకం నాణ్యత మరియు సమర్థవంతమైన అమలుపై ఉపాధ్యాయులకు అవసరమైన సూచనలు, సలహాలు అందించారు.

పాఠశాల నిర్వహణలో నాణ్యత పెంపునకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ధర్మ రెడ్డి పాఠశాలను ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఎంఈఓ వెంకట్ రెడ్డి,కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా వారు గ్రామంలోని పిల్లలు ప్రైవేట్ పాఠశాలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలోని చేరాలని ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందన్నారు.ఈ సందర్భంగా ధర్మ రెడ్డి గ్రామ సర్పంచ్ లక్ష్మీనారాయణ, ఉపసర్పంచ్ జయరాజులు ఇరువురి అధికారులను శాలువతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వాసుదేవరావు,గ్రామ ధర్మ రెడ్డి సర్పంచు లక్ష్మీ నారాయణ,ఉప సర్పంచ్ జయరాజ్,చినుర్ గ్రామ కార్యదర్శి అనిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.