05-12-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 4 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బొమ్మరాశిపేటలో లియో సంస్థలో కొన్న ప్లాట్లను వదిలి వెళ్లకుంటే చంపేస్తామని, శవాలు కూడా దొరకవని మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి బినామీలు బెదిరిస్తున్నారని బాధితు లు ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో లోకహిత సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితులు మర్రి వెంకటస్వామి, రవి కిరణ్‌రెడ్డి, అచ్యుత ఎడ్యుకేషన్ సొసైటీ ప్రధాన కార్యదర్శి కపిల్ కుమార్‌శర్మ తమ గోడు వెళ్లబోసుకున్నారు.
వారు తెలిపిన వివరా ప్రకారం.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బొమ్మరాశిపేటలో 2002లోనే లియో సంస్థ 55 ఎకరాలను 300 మందికి ప్లాట్లుగా విక్రయించింది. మిగిలిన 66 ఎకరాల్లో రిసార్ట్ నడిపింది. అప్పులు కట్టలేక రిసార్ట్ దివాలా తీయడం తో.. ఎన్సీఎల్టీ రిసార్ట్ ఆస్తులను వేలం వేసిం ది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మాజీ ఎంపీ రం జిత్‌రెడ్డికి చెందిన బినామీ సంస్థ ఆ లియో రిసార్ట్ ఆస్తులను దక్కించుకుంది. రిసార్ట్ 66 ఎకరాలు కొన్న సదరు మాజీ ఎంపీ బినామీలు..
ఇప్పుడు పక్కనే ఉన్న అమాయకుల 55 ఎకరాల ప్లాట్లను కూడా ఆక్రమించుకునేందుకు తెగబడ్డారు. లియో మెరిడియన్ భూముల సాక్షిగా రూ.వెయ్యి కోట్ల భారీ స్కామ్ జరిగిందని ఆరోపించారు. దీని వెనుక ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేంనరేందర్‌రేడ్డి హస్తం ఉన్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ప్లాట్ల యజమానులను తరిమికొట్టేందుకు ప్రైవేట్ ఆర్మీని దింపారని, రోడ్లకు అడ్డంగా గేట్లు పెట్టి, మట్టి కుప్పలు పోసి..
ప్లాట్లు వదిలి వెళ్లకపోతే శవాలు కూడా దొరకవు అని రాత్రివేళల్లో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపిం చారు. జలవిహార్ రామరాజు వ్యవహారశైలిపైనా తీవ్ర విమర్శలు చేశారు. తన కొడుకు ఆర్యన్‌రెడ్డి, ఏఐసీసీ అగ్రనేత కేసీ వేణుగోపాల్ ఇద్దరూ బిజినెస్ పార్టనర్స్ అని, ఢిల్లీలో తనకు తిరుగులేదని ఎంపీ రంజిత్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏకంగా ఏఐసీసీతోనే తనకు రియల్ ఎస్టేట్ పార్టనర్‌షిప్ ఉందంటూ రామరాజు అధికారులను భయపెడుతున్నట్లు వాపోయారు.
అచ్యుత ఎడ్యుకేషన్ సొసైటీకి చెందిన భవనాలకు అద్దె చెల్లించకపోగా.. అద్దె అడిగిన యజమానిని బెదిరింపు లకు గురిచేస్తున్నారు అని కన్నీటిపర్యంతమయ్యారు. న్యాయం చేయాలంటూ వెళ్లిన వారిని సదరు మాజీ ఎంపీ బెదిరిస్తున్నారని బాధితులు వాపోయారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్తే.. మాపై కేసులు పెడతారా మీ అంతు చూస్తాం అని స్టేషన్లలోనే రౌడీలు బెదిరిస్తున్నారని, అయినా కూడా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు.
ఓ ఉన్నతాధికారి జోక్యంతో 7 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మారలేదని చెప్పారు. స్థానిక ఎమ్మె ల్యేలు, ఎంపీలు, పెద్దల హస్తం ఉన్నదని, తామేమీ చేయలేం అని చేతులెత్తేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి ఈ మాఫియా కోరల నుంచి తమను రక్షించాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని వేడుకున్నారు. లేదంటే ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని బాధితులు హెచ్చరించారు.