14-01-2026 07:28:49 PM
* 17వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలి
* 23, 24 తేదీల్లో హైదరాబాదులో శిక్షణ
* టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి పిలుపు
చిట్యాల,(విజయక్రాంతి): జనవరి 23,24వ తేదీల్లో హైదరాబాదులోని నాంపల్లి లో ఉన్న మీడియా అకాడమీ ఆడిటోరియంలో జరగనున్న జర్నలిస్టుల శిక్షణా తరగతులను జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని టి యు డబ్ల్యూజె ( ఐజేయు) జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి కోరారు. శిక్షణ తరగతులను దృష్టిలో ఉంచుకొని బుధవారం జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించిన అనంతరం చిట్యాల లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ మీడియా అకాడమీ,టీయూడబ్ల్యూజే(ఐజేయు) ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించే ఈ శిక్షణ తరగతులకు సంబంధించి ఆసక్తి ఉన్న జర్నలిస్టులు ఈనెల 17వ తేదీలోగా టి యు డబ్ల్యూ జె జిల్లా కమిటీకి తమ పేర్లను అందజేయాలని తెలిపారు.
జర్నలిజంలో వృత్తిపరంగా ఎంతో నైపుణ్యం కోసం అందజేస్తున్న ఈ శిక్షణ జర్నలిస్టులకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస్తూనే, వృత్తిపరంగా మెలకువలు నేర్పించడం కోసం శిక్షణ తరగతులు ఏర్పాటుచేసిన మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ తో పాటు ఇంటి స్థలం, ఇల్లు, హెల్త్ కార్డులు అందించడం కోసం టియుడబ్ల్యూజే జిల్లా కమిటీ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో టీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు పులిమామిడి మహేందర్ రెడ్డి, దోటి శ్రీనివాస్,యే ళ్ల బయన్న, మెండె వెంకన్న, పోకల కరుణాకర్, చెరుపల్లి శ్రీనివాస్, మిరియాల ప్రకాష్, అమరోజు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.