calender_icon.png 9 December, 2025 | 12:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కార్యకర్తలు

08-12-2025 12:00:39 AM

కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే మదన్మోహన్‌రావు

నాగిరెడ్డిపేట్, డిసెంబర్ 7 (విజయ క్రాంతి): మండలంలోని లింగంపల్లి గ్రామం నుండి 30 మంది బిఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావు కాంగ్రెస్ పార్టీ కండువలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చేస్తున్న అభివృద్ధి, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో చేస్తున్న కార్యక్రమాలను చూసి కాంగ్రెస్ పార్టీలో చేరామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ కుమార్, గోపాల్‌గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.