calender_icon.png 9 December, 2025 | 1:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

08-12-2025 12:00:00 AM

జుక్కల్, డిసెంబర్ 7 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం వజ్రకండి గ్రామంలో రెండు రోజుల క్రితం ప్రకాష్ పటేల్ గుండెపోటుతో మరణించారు. ఆ కుటుంబాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదివారం పరామర్శించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధితుడు ప్రకాష్ పటేల్ ఆకస్మాత్తుగా మరణించడం కుటుంబానికి తీరని లోటు అని అన్నారు. ప్రకాష్ పటేల్ కు చిన్న పిల్లలు ఉన్నారని, ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పటేల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.