29-07-2024 09:06:35 PM
హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 70లోని అనేక రోజులుగా అపరిష్కృతంగా ఉన్న డ్రైనేజీ లీకేజ్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ప్రముఖ సినీ హీరో రాజశేఖర్ జీహెచ్‌ఎంసీ మేయర్, కమిషనర్‌లను కోరారు. ఈ సందర్భంగా హీరో రాజశేఖర్ సోమవారం ఎక్స్ సామాజిక మాద్యమంలో పోస్టు చేసి, జీహెచ్‌ఎంసీకి ఆన్‌లైన్ ఫిర్యాదు చేయడంతో పాటు మేయర్ గద్వాల విజయలక్ష్మీ, కమిషనర్ ఆమ్రపాలిని ట్యాగ్ చేశారు. జూబ్లిహిల్స్ రోడ్డు నంబరు 70లోని అశ్విని హైట్స్ వద్ద చాలా కాలంగా డ్రైనేజీ లీకేజ్ అవుతుందని తెలియజేసిన పోస్టులో అక్కడ రోడ్డుపై డ్రైనేజీ లీక్ ఫోటోను షేర్ చేశారు.