29-07-2024 08:07:27 PM
హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో 19 డిమాండ్లపై చర్చ కోనసాడుతుంది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, రాజనర్సింహ కలిసి ముఖ్యమంత్రి తరపున సభలో పద్దులను ప్రవేశపెట్టారు. పరిశ్రమలకు రాయతీలు గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. హెచ్ఎంటీ తదితర ప్రాంతాల్లో స్కిల్ సిటీ ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు బడ్జెట్ లో నిధులు తగ్గించారని రాజశేఖర్ రెడ్డి తెలిపారు.