13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ఆనందోత్సాహాలతో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

23-03-2026 04:44 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఒకే పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు చాలా కాలం తర్వాత ఆత్మీయ సమ్మేళనం ద్వారా కలుసుకున్నారు. ఘట్ కేసర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1972–73 సంవత్సరంలో 10వతరగతి చదివిన విద్యార్థులు వివిధ ప్రాంతాల నుండి వచ్చి హాజరై అలనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. మొదట సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. గురువులను స్మరించుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు, సత్కారాలు కూడా నిర్వహించబడ్డాయి. ఈసమ్మేళనం అందరికీ ఆనందభరితమైన మరియు మరపురాని అనుభూతిని కలిగించింది.