29-07-2024 09:21:08 PM
ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండు రోజులు పాటు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ కేంద్రం పేర్కొంది. మంగళ, బుధవారాల్లో వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అన్ని జిల్లాల్లో పలు చోట్ల బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ గాలుల వేగం గంటకు30 నుంచి 40 కిలోమీటర్లు ఉండవచ్చని పేర్కొంది.
సోమవారం వనపర్తిలో భారీ వర్షం కురవగా, జోగులాంబ గద్వాల్, నారాయణపేట, మహాబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, హన్మకొండ, రాజన్న సిరిసిల్లా, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల,జయశంకర్, నిజామబాద్, నిర్మల్ ,ఆదిలాబాద్, కుమ్రంబీం జిల్లాలోఒక మోస్తరు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చెల్ మల్కాజిగిరి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, జనగాం, సిద్దిపేట, వరంగల్, మహాబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఉమ్మడి తెలంగాణలోని 10 జిల్లాల్లో సోమవారం నమోదైన వర్షపాతం వివరాలు (మిల్లీమీటర్లలో)
నిజామాబాద్ 10.8, వరంగల్ 10.5, ఆదిలాబాద్ 9.9, మెదక్ 8.2, ఖమ్మం 7.7, మహాబూబ్‌బనగర్ 6.2, హైదరాబాద్ 5.5, రంగారెడ్డి 5.4, కరీంనగర్ 5.0, నల్గొండ 4.4.