25-11-2025 11:02:19 PM
టాలీవుడ్ నటి అనన్య నాగళ్ల జూబ్లీహిల్స్ లోని ఒలీవ క్లినిక్స్ లో సందడి చేసింది. దీర్ఘకాలిక చర్మ ఆరోగ్యాన్ని పెంచడానికి రూపొందించిన ఇన్ఫ్యూషన్ టెక్నాలజీతో కూడిన అధునాతన మైక్రో-ఛానలింగ్ అయిన డెర్మాఫ్రాక్‌ను ఆమె ప్రారంభించింది. యంగ్‌గా అనుభూతి చెందండి.. యంగ్‌గా కనిపించండి అనే వాగ్దానంతో ఒలివా క్లినిక్స్ ఈ కొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది. డెర్మాఫ్రాక్ అనేది కచ్చితమైన మైక్రో-ఛానలింగ్, శక్తివంతమైన సీరం ఇన్ఫ్యూషన్‌ను కలిపి, ఇంజెక్షన్లు, డౌన్ టైమ్ లేదా అసౌకర్యం లేకుండా లోతుగా, నియంత్రిత రీతిలో చొచ్చుకుపోవడానికి వీలు కల్పిస్తుంది.
ఈ చికిత్స ఉన్నతమైన గ్లో, కొల్లాజెన్ స్టిమ్యులేషన్, హైడ్రేషన్, టెక్స్చర్ రిఫైన్‌మెంట్‌ను అందించడం కోసం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందని ఒలివా క్లినిక్స్ ప్రతినిధులు తెలిపారు. చర్మసంబంధమైన నైపుణ్యం, అధునాతన సాంకేతికతతో కనిపించే, శాశ్వత ఫలితాలను అందించడంలో ఒలివా పలు మైలురాళ్లను అందుకుందని వెల్లడించారు. సినిమా షూటింగ్స్ కారణంగా మేకప్ వేసుకోవడంతో కొన్ని ఇబ్బందులుంటాయని, దీనికి డెర్మాఫ్రాక్ చికిత్స తీసుకుంటానని అనన్య తెలిపింది. డెర్మా ఫ్రాక్ సురక్షితమైన, అత్యంత అధునాతన మైక్రో-ఛానలింగ్ వ్యవస్థగా నిలుస్తుందనీ, గాయం లేకుండా, ఎక్కువ సమయం తీసుకోకుండా మంచి ఫలితాలను అందిస్తుందని ఒలివా క్లినిక్స్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రేఖా సింగ్ చెప్పారు.