8 March, 2026 | 5:15 AM

నెటిజన్‌పై నటి ఇషారెబ్బా ఫైర్

05-02-2026 01:58 AM
  1. ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర కామెంట్స్
  2. బంజారాహిల్స్ పోలీసులకు నటి ఫిర్యాదు

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): తన సోషల్ మీడియా ఖాతాల్లో అసభ్యకరంగా కామెంట్లు చేస్తున్న వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో టాలీవుడ్ నటి ఇషారెబ్బా బుధవారం ఫిర్యాదు చేశారు. గత కొద్ది రోజులుగా ఓ వ్యక్తి ఆమె ఇన్‌స్టా పోస్టుల కింద హద్దులు మీరి అసభ్యకరమైన కా మెంట్స్ పెడుతున్నాడు. విసిగిపోయిన ఇషా.. చట్టపరంగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. బంజారాహిల్స్ పోలీసు లను ఆశ్రయించడంతో నిందితుడిపై కేసు నమోదైంది. సదరు వ్యక్తిని గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.