calender_icon.png 5 February, 2026 | 5:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాన్సర్ ముందస్తు గుర్తింపుతో రక్షణ

05-02-2026 02:00:29 AM

అమోర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అవగాహన వాకథాన్

హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): క్యాన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపుపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో నగరంలోని ప్రముఖ వైద్య సంస్థ అమోర్ హాస్పిటల్స్ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం అవగాహన వాకథాన్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నగర పౌరులు, వైద్య నిపుణులు, క్యాన్సర్ను జయించిన బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అనంతరం అవగాహన సదస్సులో వైద్య నిపుణులు క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదకారక అంశాలు, ప్రారంభ దశలో కనిపించే లక్షణాలు, సమయానికి నిర్ధారణ జరిగితే చికిత్స ఫలితాలు ఎలా మెరుగుపడతాయో వివరించారు. కార్యక్రమంలో క్యాన్సర్ నుంచి కోలుకున్న బాధితులతో జరిగిన అనుభవాల పంచుకునే సమావేశం హృదయాలను కదిలించింది.

అమోర్ హాస్పిటల్స్ ఎండీ డా. కిషోర్ బి. రెడ్డి మాట్లాడుతూ, చికిత్సకన్నా ముందస్తు నివారణ, గుర్తింపుపై దృష్టి పెట్టినప్పుడే క్యాన్సర్‌ను నియంత్రించగలమన్నారు. క్యాన్సర్ నివారణను అందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతో అమోర్ హాస్పిటల్స్ కేవలం రూ.999 ప్రత్యేక ధరకు సంపూర్ణ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్యాకేజీని ప్రారంభించినట్లు తెలిపారు.