calender_icon.png 18 February, 2026 | 3:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సినీ నటి ప్రత్యూష కేసు 4 వారాల్లోగా లొంగిపోవాలి

18-02-2026 01:29:18 AM

సిద్దార్థరెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: దేశ వ్యాప్తంగా ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష హత్య కేసులో సుప్రీంకోర్టు మంగళవారం తుది తీర్పు వెలు వరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సిద్దార్థరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రెండు దశాబ్దాలకు పైగా నడుస్తున్న ఈ కేసులో జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ లతో కూడిన ధర్మాసనం మంగళవారం కీలక తీర్పును వెలువరిం చింది.

సిద్దార్థరెడ్డి పిటిషన్‌ను కొట్టివేస్తూ, నాలుగు వారాల్లో లొంగిపో వాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.ఈ కేసును విచా రించిన తెలంగాణ హైకోర్టు అప్పట్లోనే సిద్దార్థరెడ్డికి జైలు శిక్షను ఖరారు చేసింది. కానీ నిందితుడు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం.. నిందితుడికి గతంలో హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సమర్థించింది. నాలుగు వారాల్లో లొంగిపోవాలని స్పష్టం చేసింది.

ఇక, ఈ కేసులో పోస్టుమార్టం జరిగిన తీరుపై అత్యున్నత న్యాయస్థానం అసం తృప్తి వ్యక్తం చేసింది. పోస్టుమార్టం నిర్వహించిన పద్ధతి సరిగా లేదని పేర్కొంది. కాగా ప్రత్యూష, సిద్దార్థరెడ్డి హైదరాబాద్‌లో ఇంట ర్ చదువుతున్నప్పుడు ప్రేమించుకున్నారు. ఇంటర పూర్తయిన అనంతరం ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లగా.. సిద్దార్థరెడ్డి ఇంజినీరింగ్‌లో చేరాడు. 2002 ఫిబ్రవరి 23న ఇద్దరు విషం తాగిన పరిస్థితిలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.

ప్రతూష 24న మరణించారు. చికిత్స అనంతరం మార్చి 9న సిద్దార్థరెడ్డి డిశ్చార్జి అయ్యాడు. వారు కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి తాగినట్లు పరీక్షల్లో గుర్తించారు. ఆర్గానోఫాస్పేట్ కారణంగా ప్రత్యూష చనిపోయిందని.. ఊపిరాడకుండా చేయడం, మరణానికి ముందు ఆమెపై లైం గిక దాడి వంటివి జరగలేదని రాష్ట్ర ప్రభు త్వం నియమించిన ముగ్గురు వైద్యుల బృం దం నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా దరా ్యప్తు జరిపిన సీబీఐ.. నిందితుడిపై 306,(ఆత్మహత్యకు పురిగొల్పడం), 309 (ఆత్మహ త్యకు యత్నించడం) సెక్షన్ల కింద ఛార్జిషీట్ దాఖలు చేసింది.

నిందితుడు సిద్ధార్థరెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఐదేళ్ల కఠిన కారాగారశిక్ష, రూ.5.వేలు జరిమానా విధిస్తూ 2004 ఫిబ్రవరి 23న తీర్పు ఇచ్చారు. దీనిపై సిద్దార్థరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా జైలుశిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ జరిమానాను రూ. 50వేలకు పెంచుతూ 2011 డిసెంబరు 28న తీర్పు వెలువరించింది. దీనిపై సిద్ధార్థరెడ్డి, ప్రత్యూష తల్లి సరో జినీదేవి 2012లో సుప్రీంకోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై ఇటీవల విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా సిద్దార్థరెడ్డి లొంగిపోవాలంటూ తీర్పు వెలువరించింది.

సరైన శిక్ష పడలేదు: ప్రత్యూష తల్లి

తన కూతురు మృతి కేసులో సుప్రీంకో ర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, కానీ తమ కు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని సినీ నటి ప్రత్యూష తల్లి సరోజినీదేవి అన్నా రు. ప్రత్యూష మృతి కేసులో సిద్దార్థరెడ్డిని లొంగిపోవాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిం ది. సుప్రీంకోర్టు తీర్పుపై ఆమె స్పందిస్తూ, అతనికి సరైన శిక్ష పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.తన కూతురు మృతి చెందిన సమయంలో తమకు బెదిరింపులు వచ్చాయని, కానీ ధైర్యంగా న్యాయస్థానంలో పోరాడామన్నారు.

తన కూతురు ఆత్మహత్య చేసుకునేం త పిరికిది కాదని, ఆమెను చంపేశారని ఆరోపించారు. న్యాయం కోసం మొదటి నుంచి పోరాటం చేస్తున్నానని అన్నారు. ఉన్నతస్థానానికి చేరుకోవాల్సిన తన కూతురు జీవి తాన్ని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశా రు. నిందితుడు సిద్ధార్థరెడ్డి విదేశాల్లో ఉన్నాడని తెలిసిందని అన్నారు.

ఈ కేసును మొద ట్లోనే అంతా తారుమారు చేశారని ఆరోపించారు. పోస్టుమార్టం నివేదికను కూడా ఆమె తప్పుబట్టారు. కానీ కొన్ని సాక్ష్యాలను సేకరించి పోరాటం ప్రారంభించానని అన్నారు. అప్పు డే సాక్ష్యాలు అన్నీ ఉండి ఉంటే నిందితులకు జీవితకాల శిక్ష తప్పకుండా పడేదని అన్నా రు. 24 ఏళ్లుగా ఒంటరిగా పోరాడుతూ నరకం అనుభవిస్తున్నానని, తమకూ ఎవరూ తోడుగా రాలేదన్నారు.