26 June, 2026 | 1:56 AM

శేరిలింగంపల్లిలో బీఆర్‌ఎస్‌కు మరో భారీ షాక్

26-06-2026 01:09 AM

కవిత సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ 

శేరిలింగంపల్లి, జూన్ 25 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీకి శేరిలిం గంపల్లి నియోజకవర్గంలో మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. సీనియర్ నాయకుడు సామాజిక సేవా కార్యకర్త వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ బీఆర్‌ఎస్ను వీడి టీఆర్‌ఎస్లో చేరారు. గురువారం మియాపూర్లోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.

ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్‌లో చేరడంతో బలహీనపడిన బీఆర్‌ఎస్ పార్టీకి ఇది తీవ్ర ఎదురుదెబ్బ కానుంది.15 ఏళ్ల సేవకు తగిన గుర్తింపు లభించకపోవడం, నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వకపోవడం, హామీలు అమలు చేయకపోవడంతో అసంతృప్తి చెందిన చంద్రశేఖర్ ప్రసాద్ కవితతో చర్చించి టీఆర్‌ఎస్లో చేరారు. మియాపూర్ నుంచి భారీ ర్యాలీతో తన బలాన్ని చాటుకున్నారు.ఈ పరిణామంతో బీఆర్‌ఎస్ క్యాడర్లో తీవ్ర గుబులు నెలకొంది. త్వరలోనే మరికొందరు నాయకులు బీఆర్‌ఎస్ పార్టీని వీడి టీఆర్‌ఎస్లో చేరే అవకాశం ఉందని ప్రచారం.