క్షీణించిన అదానీ గ్రీన్ నికరలాభం
04-05-2024 12:05 AM
న్యూఢిల్లీ, మే 3: అదానీ గ్రూప్ పునరుత్పాదక ఇంధన కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ నికర లాభం క్యూ4లో భారీగా తగ్గింది. 2023 ఆర్థిక సంవత్సరం జనవరి త్రైమాసికంలో కంపెనీ నికరలాభం 70 శాతం క్షీణించి రూ.150 కోట్లకు చేరింది. గత ఏడాది క్యూ4లో కంపెనీ రూ.508 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 2 శాతం తగ్గి రూ.2,587 కోట్ల నుంచి రూ. 2,527 కోట్ల వద్దకు పడిపోయింది.






