20 June, 2026 | 10:06 PM

కాంగ్రెస్‌పై అదానీ పొగడ్తలు

20-06-2024 01:43 AM

సంస్కరణలకు పునాది వేసింది పీవీ, మన్మోహన్‌లే

ముంబై, జూన్ 19: తరచూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నుంచి విమర్శలను ఎదుర్కొనే వివాదాస్పద వాణిజ్యవేత్త గౌతమ్ అదానీ తాజాగా కాంగ్రెస్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. బుధవారం క్రిసిల్ ఇన్‌ఫ్రా సదస్సులో అదానీ మాట్లాడుతూ 1991లో కాంగ్రెస్ ప్రధాని పీవీ నరసింహారావు, అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్‌లే దేశంలో సంస్కరణలకు పునాది వేశారని, భారత ఆర్థిక ప్రగతికి కారకులయ్యారన్నారు. 1991 నుంచి 2014 కాలంలో ఆర్థికాభివృద్ధికి ఫౌండేషన్లు వేసి, రన్‌వే నిర్మించగా, 2014 నుంచి 2024 మధ్యకాలంలో ఎయిర్‌క్రాఫ్ట్‌లు టేకాఫ్ అవుతున్నాయని అదానీ చెప్పుకొచ్చారు. ఇండియా కూటమి సభ్యుల సంఖ్య లోక్‌సభలో 233కు పెరిగిన కారణంగా మోదీ ప్రభుత్వం తీసుకునే ఎటువంటి ఆర్థిక విధాన నిర్ణయాలకైనా వారి మద్దతు కూడా అవసరమే. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ను అదానీ పొగిడారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.