20 June, 2026 | 11:12 PM

ఫిక్కీ మహిళల ఫ్యాషన్ వర్క్ షాప్

20-06-2024 01:42 AM

హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): మహిళా సాధికారతలో భాగంగా బ్రాండ్ హైదరాబాద్‌ను ఎలా నిలబెట్టాలో తెలియపర్చేందుకు ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎల్‌వో) ఆధ్వర్యంలో పార్క్ హోటల్‌లో మ్యాగ్నెటిక్ బ్రాండ్స్ పేరుతో ఫ్యాషన్ వర్క్ షాప్, మేథోమథన కార్యక్రమం జరిగింది.  తెలంగాణ మహిళలు ఫ్యాషన్ దుస్తులు, ఆర్ట్ డిజైనింగ్‌తో స్టార్టప్ స్థాయి నుంచి వ్యాపార ప్రస్థానం  ప్రారంభించి  ప్రపంచ వ్యాప్త బ్రాండ్‌గా  ఎలా వ్యాపారాభివృద్ధి సాధించవచ్చో  ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మహిళా విభాగం  చైర్ పర్సన్ ప్రియా గజ్‌దార్ వివరించారు.

ఈ సందర్భంగా పలు విజయవంతమైన కేస్‌స్టడీస్‌తో ఆర్టరీ ఇండియా అండ్ లగ్జరీబ్రాండ్స్, సీఈవో అరవింద్ విజయ్ మోహన్ ప్రశ్నోత్తర కార్యక్రమం నిర్వహించారు. ఫ్యాషన్ ప్రపంచంలో తమదైన బ్రాండ్‌ను సృష్టించుకుని గుక్సీ, కెల్విన్ క్లెయిన్ తదితర  ప్రపంచ స్థాయి బ్రాండ్స్ తో పోటీ పడేలా హైదరాబాద్ మహిళలు తమ కళా నైపుణ్యం ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకోవాలన్నారు. పెయింటింగ్, ఫ్యాషన్ ఇండస్ట్రీ  తెలంగాణ మహిళలు  ఆర్ట్‌డిజైనర్ బ్రాండ్స్‌ను సృష్టించే మహిళా ఎంటర్ ప్రెన్యూయర్స్‌కు ఎదురయ్యే సవాళ్ల గురించి ఆయన చర్చించారు.