4 July, 2026 | 9:14 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

పదవ తరగతి ప్రశ్నాపత్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

06-03-2026 01:25 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి):  జిల్లా కేంద్రంలోని ఐ డి ఓ సి కార్యాలయంలో పదవ తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్ పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన ప్రశ్నాపత్రాల భద్రతా ఏర్పాట్లను ఆయన తనిఖీ చేసి, పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని స్ట్రాంగ్ రూమ్ నుండి వివిధ పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాలను పంపిణీ చేశారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డీఈఓ కార్యాలయ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.