6 March, 2026 | 5:39 PM

కృష్ణయ్య మృతి పార్టీకి తీరని లోటు

06-03-2026 01:27 PM

బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ 

దేవరకొండ,(విజయక్రాంతి): కృష్ణయ్య మృతి పార్టీకి తీరని లోటు బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు శుక్రవారం పీఏ పల్లి మండలం మేడారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం నాయకులు నేర్లపల్లి కృష్ణయ్య మృత దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం కృష్ణయ్య కుటుంబ సభ్యులకు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణయ్య కుటుంబానికి పార్టీ పరంగా అండగా ఉంటానని ఆయన తెలిపారు. కృష్ణయ్య మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. కృష్ణయ్య ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆయన భగవంతుని ప్రార్ధించారు. ఆయన వెంట పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు  వల్లపు రెడ్డితదితరులు ఉన్నారు.