17 August, 2026 | 1:08 AM

రాజేంద్రనగర్, గండిపేట్ తహసీల్దార్ కార్యాలయాల్లో అదనపు కలెక్టర్ తనిఖీలు

17-08-2026 12:00 AM

రాజేంద్రనగర్, అగస్టు16(విజయక్రాంతి): 22-ఏ నిషేధిత భూముల జాబితా స వరణపై జరగనున్న సమీక్షా సమావేశం నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (రె వెన్యూ) చంద్రారెడ్డి ఆదివారం రాజేంద్రనగర్, గండిపేట్ తహసీల్దార్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల వారీగా నిషేధిత ఆస్తుల రికార్డులు, రిజిస్టర్లు మరియు సంబంధిత ఉత్తర్వులను ఆయన క్షుణ్ణంగా పరిశీ లించారు.

రికార్డులలో ఎలాంటి లోపాలు లే కుండా పక్కా ఆధారాలతో నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కేవ లం కాగితాలకే పరిమితం కాకుండా, 22-ఏ జాబితా రూపకల్పనలో అవసరమైన చోట క్షేత్రస్థాయి పరిశీలన  తప్పనిసరిగా జరపాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ, వివాదాస్పద భూముల విషయంలో పారదర్శకత పాటించాలని, అర్హత ఉన్న భూములు అనవసరంగా నిషేధిత జాబితాలోకి చేరకుండా పక డ్బందీగా పరిశీలించాలని సూచించారు. కా ర్యక్రమాలలో రాజేంద్రనగర్ తహసీల్దార్ రా ములు, గండిపేట్ తహసీల్దార్ ఎన్. శ్రీనివా స్ రెడ్డి,రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.